కృష్ణాజిల్లా తిరువూరు మండలం చిక్కుళ్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరువూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లా చిక్కుళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు