ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నలుగురి ప్రాణం తీసిన ఫ్లెక్సీ..! - కాసా నగర్​ వద్ద రోడ్డుప్రమాదం నలుగురు మృతి

4 Dead in Road accident
ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : May 26, 2022, 1:36 PM IST

Updated : May 26, 2022, 3:28 PM IST

13:32 May 26

పెళ్లి బృందం వాహనంలోని నలుగురు మృతి

Road accident: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం సమీపంలో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. ప్రమాద స్థలంలోనే నలుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుంచి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ.. వాహనానికి అడ్డురావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్ బాషా ఘటన స్థలాన్ని పరిశీలించించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు గుర్రం విజయ(50), బూరేపల్లి రమణ(52), బూరేపల్లి వెంకటేశ్వరమ్మ(50), కోన వెంకటేష్(70)గా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 26, 2022, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details