కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురం బైపాస్‌లో ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న లారీ చందాపురం బైపాస్ సమీపంలో సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. ఇది గమనించకుండా వెనక నుంచి వేగంగా మరొక లారీ వచ్చి ఢీకొట్టింది. ముందున్న రెండు లారీల.. ప్రమాద ఘటనని పసిగట్టిన ఆర్టీసీ బస్సు నిదానంగా వస్తుండగా.. ఆ బస్సును వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది.
మూడు లారీలు, ఓ బస్సు ఢీ.. తప్పిన ప్రాణ నష్టం - చందాపురం రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా నందిగామలో సినీఫక్కీలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు లారీలు, ఓ బస్సు ఢీకొన్నాయి. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
మూడు లారీలు, ఓ బస్సు ఢీ.. తప్పిన ప్రాణ నష్టం
మెుత్తంగా ఈ ప్రమాదంలో మూడు లారీలు, ఒక బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కావటంతో.. ఎవరికి వారు వేరే వాహనాల్లో వెళ్లిపోయారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇదీ చదవండీ..శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు..ఆర్పేందుకు యత్నం