ప్రమాదానికి కారణం వాళ్లే… అయినా పట్టించుకోవటం లేదు - ప్రమాదానికి కారణం వాళ్లే
ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు బస్సు ప్రమాద ఘటన బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
acci
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జరిగిన ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో బాధితులు నందిగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రమణ ట్రావెల్స్ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదంటూ క్షతగాత్రులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినా... యాజమాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.