విజయవాడలో రెండు లారీలు ఢీ-ఒకరు మృతి - విజయవాడ
కృష్ణాజిల్లా విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. మరో డ్రైవర్ కు గాయాలయ్యాయి.
విజయవాడ.... రామవరప్పాడు-కోల్‌కతా జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ లారీ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున గన్నవరం వైపు వెళ్తున్న లారీని...... వెనుక వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ కోటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్ కట్ చేసి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు.