కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కమ్యూనిటీ పారామెడికల్ అసోషియేషన్లోని ఆర్ఎంపీ వైద్యులంతా సమావేశమయ్యారు. సంఘానికి డా. బీ.సీ. రాయ్ ప్రొవైడర్స్‌గా నామకరణం చేశారు. ఆర్ఎంపీ వైద్యులెవరు తమ పేర్ల ముందు డాక్టర్ పదాన్ని వినియోగించరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను రాష్ట్రమంతా పాటించాలని.. సంఘం అధ్యక్షుడు సీఎల్. వెంకట్రావు ప్రకటించారు.
'ఆర్ఎంపీలు.. తమ పేర్ల ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దు' - rmp doctors association meeting at krishna dist
ఆర్ఎంపీలకు చెందిన కమ్యూనిటీ పారామెడికల్ అసోషియేషన్ పేరును డా.బీ.సీ.రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ సంఘంగా నామకరణం చేశారు. ఆర్ఎంపీ వైద్యులను డాక్టర్‌గా పరిగణించరాదనే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని అసోషియేషన్ అధ్యక్షుడు వెల్లడించారు.
!['ఆర్ఎంపీలు.. తమ పేర్ల ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4064364-888-4064364-1565148457402.jpg)
'ఆర్ఎంపీ వైద్యుల పేర్ల ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దు'
డాక్టర్. బీ.సీ. రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ సమావేశం
ఇవీ చదవండి...క్రమబద్దీకరణకై చీరాలలో ఎఎన్ఎంల ఆందోళన