ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యం.. పేరు మార్చి అమ్మేశారు! - ricemill cheating news

బీపీటీ రైస్ అని చెప్పి రేషన్ బియ్యం అమ్మారంటూ కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు వస్తోందని ఆశపడి కొనుక్కున్నామని వాపోయారు.

rice mill owner sold ration rice on the name o fBPT rice in kirshna dst koduru mandal
rice mill owner sold ration rice on the name o fBPT rice in kirshna dst koduru mandal

By

Published : May 25, 2020, 1:44 PM IST

కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇద్దరు యువకులు.. నాగాయలంక లోని రైస్ మిల్లులో పని చేస్తున్నారు. మిల్లు యజమాని జీతానికి బదులు బీపీటీ రైస్ ఇస్తామని చెప్పగా.. 800 రూపాయలకే వస్తోందని తీసుకున్నట్టు చెప్పారు.

కానీ.. ఇంటికి వెళ్లి చూసుకున్న తరువాత అవి రేషన్ బియ్యం అని తెలుసుకుని తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా వచ్చి బియ్యం ప్యాకెట్లను అమ్మితే కొన వద్దని బాధిత యువకులు స్థానికులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details