యంత్రాలకు 'వడ్లు' రాలతాయి - Rice harvest news in krishna district
లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చేతికొచ్చిన పంట కోసేందుకు కూలీలు రాక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యంత్రాలకు అనుమతి ఇవ్వటంతో ఇతర రాష్ట్రాల నుంచి వరికోత మిషన్లతో కోతలు మొదలుపెట్టారు.
యంత్రాలకు 'వడ్లు' రాలతాయి
కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇదంతా కోతకొచ్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కూలీలు అందుబాటులో లేరు. ఇటీవలే వ్యవసాయ యంత్రాలకు అనుమతులివ్వటంతో తమిళనాడు, కర్ణాటకల నుంచి వరికోత మిషన్లు ఈ ప్రాంతానికి వచ్చాయి. పంటకోతలు మొదలుపెట్టాయి.