కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ రెవిన్యూ గ్రామం వక్కపట్లవారిపాలెం పంచాయతీ పరిధిలో.. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు.. పలువురు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సర్వే నెంబరు 28, 29, 30, 41 లో 11.71 సెంట్లు గట్టు భూములు ప్రభుత్వానికి చెందినవని... ఆక్రమించిన వారు శిక్షార్హులని.. వారిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయా భూముల్లో అధికారులు బోర్డులు పెట్టారు. అయితే.. అదే భూముల్లో.. 30 ఏళ్లుగా తాము సాగు చేస్తున్నామని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రెవిన్యూ అధికారులు పేదల ఇండ్ల స్థలాల కోసం ఆ భూమిని తీసుకోవడం వలన తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సదరు సర్వే నెంబరు ఉన్న పొలాల్లో వరి నాట్లు వేస్తున్నామని చెప్పారు. పొలం దగ్గరకు వచ్చిన రైతులకు రెవిన్యూ అధికారులతో వాదోపవాదానికి దిగారు. సదరు రైతుల పొలాలు తీసుకుంటే భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూములపై ప్రభుత్వ హెచ్చరికలు.. ఆందోళనలో రైతులు - ప్రభుత్వం భూములను ఆక్రమిస్తే... చర్యలు తప్పవు
3 దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులను.. ప్రభుత్వ హెచ్చరికలు ఆందోళనలో పడేస్తున్నాయి.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే... చర్యలు తప్పవు