ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్​కు... రివర్స్ టెండరింగ్! - ఏపీలో సోలార్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్

6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పాటించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు వెల్లడించింది.

reverse tendering for solar projects in andhra pradesh
సౌర విద్యుత్ ప్లాంట్​కు రివర్స్ టెండరింగ్

By

Published : Feb 5, 2021, 12:26 PM IST

వేర్వేరు ప్రాంతాల్లో నిర్మించనున్న 6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం టెండర్లు ఖరారు చేయడంలో... రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పాటించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. వేర్వేరు ప్రాంతాల్లో నిర్మించనున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 24 బిడ్లు దాఖలైనట్లు సర్కారు స్పష్టం చేసింది. కిలో వాట్ ధర రూ.2.48 పైసలకు సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఏపీ డిస్కమ్‌లు కుదుర్చుకున్న పీపీఏలతో పోలిస్తే ఈ ధర తక్కువని ప్రభుత్వం తెలిపింది. గతంలో కిలోవాట్ కు రూ.5.2 పైసల చొప్పున చెల్లించినట్లు వెల్లడించింది. వచ్చే ముప్పై ఏళ్ల పాటు ఇదే ధరకు విద్యుత్​ను పొందే అవకాశం ఉన్నట్లు ఇంధన శాఖ తెలిపింది. ఈ చర్యవల్ల ఏడాదికి రూ.3,800 కోట్లు ఆదా అవుతాయని ఇంధన శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రైతులకు నిరంతరాయ ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు సబ్సిడీ భారాన్ని తగ్గించే లక్ష్యంతో సౌర విద్యుత్తు ప్రాజెక్టు చేపట్టినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 14వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు వల్ల భవిష్యత్​లో రూ.50 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగినట్టేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details