రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు చేశారు. వీఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బరంపార్క్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో జేసీ మాధవీలత పాల్గొని కేక్ కట్ చేశారు. యోగాసనాల విశిష్టతను యోగా గురువు... ఉద్యోగినులకు వివరించారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచాలని వైద్యులు సూచించారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే రెవెన్యూ ఉద్యోగులు.. సెలవు దొరకటంతో సరదాగా గడిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో... సాంప్రదాయ, సినిమా పాటలకు ఉద్యోగినులు నృత్యాలు చేశారు.