విజయవాడ ధర్నా చౌక్‌లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర సమ్మె సమయంలో సెలవు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఉచిత బస్ పాస్‌లతో తమను సూపర్ లగ్జరీ బస్‌లలో ప్రయాణించేలా అనుమతించాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగాధరరావు విజ్ఞప్తి చేశారు. పీఎఫ్ మొత్తాలను ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
విజయవాడలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన - undefined
ఏపీ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు విజయవాడలో నిరసన చేపట్టారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
ఇదీ చదవండి: