ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లోపాల్ని ఎత్తిచూపినప్పుడు ప్రభుత్వం సరిదిద్దుకోవాలి' - సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాలగౌడ వార్తలు

ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాలు నడుచుకోవటం ఎంతమాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాలగౌడ అన్నారు. ప్రభుత్వం ఇలాగే తప్పులు చేస్తే ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన 'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

justice venkata gopala gowda
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాలగౌడ

By

Published : Aug 14, 2020, 7:44 AM IST

ప్రభుత్వ వ్యవస్థ అంటే నియంతృత్వ పాలన కాదని.. ఎవరైనా రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా పాలించాల్సిందేనని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాలగౌడ అన్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాలు నడుచుకోవటం ఎంతమాత్రమూ సరికాదన్నారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపినప్పుడు వాటిని సరిదిద్దుకునే ఔదార్యం పాలకులకు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాగే తప్పులు చేస్తే ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన 'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం' పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. జస్టిస్‌ గోపాలగౌడ బెంగళూరు నుంచి ఆన్‌లైన్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

అనేక పంటలు పండే 33 వేల ఎకరాల భూముల్ని ఏపీ రాజధాని కోసం రైతుల నుంచి తీసుకున్నారు. వాటిలో సచివాలయం, హైకోర్టు సహా అనేక ప్రభుత్వ కార్యాలయ భవనాలు గత సర్కారు హయాంలోనే నిర్మాణమయ్యాయి. అలాంటి చోట నుంచి రాజధానిని తరలించేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు రాజ్యాంగ సమ్మతంగా, చట్టబద్ధంగా లేవంటూ వడ్డే ఆయన పుస్తకంలో వివరంగా రాశారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి దీనిపై ఏమీ మాట్లాడను. అమరావతి నుంచి రాజధాని తరలింపు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి గొడ్డలిపెట్టు కాగలదని.. ప్రస్తుత సర్కారు వ్యవహార శైలీ, గత ముఖ్యమంత్రి తప్పిదాలు, మరో పార్టీ కపట నాటకాలు, మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదించటం వంటి అంశాలన్నింటినీ పుస్తకంలో చక్కగా వివరించారు. దీన్ని చదివి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి- జస్టిస్‌ వెంకట గోపాలగౌడ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

జగన్‌ అండ్‌ కో విశాఖపట్నంలో ఉన్న తమ భూముల విలువను పెంచుకునేందుకే రాజధానిని అక్కడికి తరలిస్తున్నారని పుస్తక రచయిత వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.

ఇదీ చూడండి.'రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల నిధులివ్వండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details