ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ రోజుల్లో కూడా ఉద్యోగులకు రూ. వెయ్యి పింఛనా - రిటైర్డ్ ఉద్యోగులు

ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేసినా, నెలకు వేయి రూపాయల పెన్షన్ ఇవ్వడం సిగ్గుచేటని పెన్షనర్ అసోసియోషన్లు విజయవాడలో ధర్నాకు దిగాయి. కనీస పింఛను రూ.9వేలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు.

నిరసన చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు

By

Published : Aug 20, 2019, 6:37 PM IST

Updated : Aug 20, 2019, 6:48 PM IST

నిరసన చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత పేరుతో వృద్ధాప్యపు పెన్షన్ లను రెండు నుంచి మూడు వేల రూపాయలు చెల్లిస్తున్నా,కేంద్రానికి మాత్రం తమ పై దయ కలగడం లేదని పెన్షనర్ల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు ప్రభుదాస్ అన్నారు.ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి రిటైరైన తమకు ఇప్పటికీ నెలకు వెయ్యి రూ.చెల్లిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోజుల్లో కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వడం అన్యాయమని అన్నారు.కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని,ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు.పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ లో ఆల్ పెన్షనర్స్,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

Last Updated : Aug 20, 2019, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details