కృష్ణాజిల్లా నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన పునః ప్రతిష్ట వేడుకలు గత రెండు రోజులుగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. వేడుకల చివరిరోజైన బుధవారం త్రిదండి శ్రీ రామానుజ జీయర్ స్వామి వారిచే నూతన ఆలయ, ధ్వజస్తంభ, శిఖర, కలశ ప్రతిష్ట మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గోపూజలు, ఆలయ ప్రతిష్ట హోమాల్లో జీయర్ స్వామి పాల్గొన్నారు. యావత్ మానవాళి శ్రీరామచంద్రస్వామి చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని పయనించాలని జీయర్ స్వామి ప్రవచించారు. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Chinna Jeeyar Swamy: రుద్రపాకలో సీతారాముల విగ్రహాలు పునః ప్రతిష్ట - ఆధ్యాత్మిక వార్తలు
కృష్ణాజిల్లా నందివాడ మండలం రుద్రపాక గ్రామంలోని సీతారామచంద్ర స్వామి వార్ల విగ్రహ పున:ప్రతిష్ట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ త్రిదండి శ్రీ రామానుజ జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరిగాయి.
రుద్రపాకలో సీతారాముల విగ్రహాల పునః ప్రతిష్ట
ఈ వేడుకల్లో కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణ వీరయ్య బాబ్జి, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ORIENTATION COURSE: గన్నవరంలో మహిళా పోలీసులకు ఓరియెంటేషన్ కోర్సు