తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా...ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని.... కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. ఈ మేరకు పార్టీనుద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెదేపా పని అయిపోయిందని... భవిష్యత్లో పార్టీ మనుగడ సాగించడం కష్టమన్నారు. తెదేపాకు 4 ఏళ్లుగా సేవలందిస్తూ, సరైన గుర్తింపు లేకనే తెదేపాకు రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు టికెట్ ఇచ్చే విషయంలోనూ చివరి వరకు అధిష్ఠానం సందిగ్ధంలో ఉంచిందని, కాపులకు తెదేపాలో భవిష్యత్ ఉండదని...అందువల్లే రాజీనామా చేస్తున్నానన్నారు. అధికారంలో ఉన్న తెదేపా...కాపు సామాజిక వర్గాన్ని 5 ఏళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంలోనూ చులకన భావంతో చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రగతిని గుర్తించడంలో తెదేపా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఏ పార్టీలోకి వెళ్తాననేది...త్వరలోనే నియోజకవర్గ ప్రజలను సంప్రదించాక చెప్తానన్నారు.
గుర్తింపు లేకే తెదేపాకు రాజీనామా: వరుపుల రాజా - undefined
తెదేపాకు 4 ఏళ్లుగా సేవలందిస్తున్న తనకు సరైన గుర్తింపు లేకే రాజీనామా చేస్తున్నానని...ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా ప్రకటించారు. ఈ మేరకు తెదేపా పాలనలో చోటుచేసుకున్న పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గుర్తింపు లేకే రాజీనామా చేస్తున్నా: వరుపుల రాజా
గుర్తింపు లేకే రాజీనామా చేస్తున్నా: వరుపుల రాజా
ఇదీ చూడండి: 'మంత్రి బొత్స పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు'
Last Updated : Aug 29, 2019, 7:05 PM IST