విద్యుత్ దీపాలంకరణలో సచివాలయం గణతంత్ర దినోత్సవానికి రాష్ట్ర సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సచివాలయంలో 5 బ్లాకులను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయటంతో రాత్రివేళలో కాంతులీనుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ భవనాలను అలంకరించేందుకు ప్రభుత్వం 56 లక్షలు విడుదల చేసింది. రాజ్‌భవన్, హెచ్‌ఓడీ కార్యాలయాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను అలంకరిస్తున్నారు. వీటితో పాటు బందరు రోడ్డులోనూ విద్యుత్ దీపాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. విద్యుత్ దీపాల వెలుగులతో సచివాలయ భవనాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.