జగ్గయ్యపేటలో 65 సంవత్సరాలు పైబడిన ఓ వృద్ధురాలికి కరోనా సోకగా.. విజయవాడలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది. అక్కడ పడకలు లేవని సిబ్బంది చెప్పగా.. ఆమె ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్లింది. ఈ ఘటనపై.. బాధిత కుటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్తామన్న సిబ్బంది తీరును తప్పుబట్టారు. వృద్ధురాలని కూడా చూడకుండా.. కరోనా బాధితురాలి విషయంలో ఇంత నిర్లక్ష్యం పనికిరాదన్నారు. స్పందించిన తహసీల్దార్ రామకృష్ణ, ఎస్సై ధర్మరాజు.. బాధిత కుటుంబంతో 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రోగిని విజయవాడ క్వారంటైన్ కు తరలించారు.