రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతీ రిజిస్ట్రేషన్ ప్రక్రియనూ వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ ఫిర్యాదులు రావటంతో ఈ ప్రక్రియపై నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీడియో రికార్డింగ్‌తో రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ
రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పర్యవేక్షించనున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ ఫిర్యాదులు రావటంతో ఈ ప్రక్రియపై నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల్లో వీడియో రికార్డింగ్, వీడియో పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయటంతో పాటు నిఘా కొనసాగించాలని భావిస్తున్నట్టు రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలాల్లో వీడియో రికార్డింగ్, వీడియో పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో రికార్డింగ్‌ను రాష్ట్రస్థాయిలోని ఓ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వీడియో రికార్డింగ్ ఖర్చులకు సంబంధించి యూజర్ ఛార్జీల నుంచి వసూలు చేసే మొత్తం నుంచి భరించాల్సిందిగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది...