కృష్ణా జిల్లాలో మెస్సార్స్ వేదాంత లిమిటెడ్.. చేపట్టనున్న హైడ్రోకార్బన్ బావుల తవ్వకాలపై మొవ్వ మండలం కాజా గ్రామంలో.. అధికారులు ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. తమపొల్లాల్లో బావులు తవ్వితే పర్యావరణం కలుషితం అవుతుందని గ్రామస్థులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ నిక్షేపాల కోసం.. తవ్వకాలు జరపవద్దని స్పష్టంచేశారు. కృష్ణాజిల్లాలోని మొవ్వ, గుడూరు, పామర్రు మండలాల్లో.. 35 బావులు తవ్వేందుకు వేదాంత లిమిటెడ్.. ప్రయత్నాలు చేపట్టింది. బావి నుంచి రోజుకు 30వేల బ్యారెల్స్ ఆయిల్‌ను తీయనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
హైడ్రోకార్బన్ బావుల తవ్వకాలపై.. ప్రజాభిప్రాయసేకరణ
కృష్ణా జిల్లాలో మెస్సార్స్ వేదాంత లిమిటెడ్.. చేపట్టనున్న హైడ్రోకార్బన్ బావుల తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మొవ్వ మండలం కాజా గ్రామంలో అధికారులు ప్రజాభిప్రాయసేకరణ చేశారు.
హైడ్రోకార్బన్ బావుల తవ్వకాలపై ప్రజాభిప్రాయసేకరణ