మరో రెండు రోజుల పాటు నూజివీడులో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణా జిల్లా రెవెన్యూ డివిజన్ నూజివీడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్కరూ ఇళ్లు వదిలి బయటికి రావొద్దని కోరారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను అందజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
నూజివీడులో రెడ్ అలర్ట్ పొడిగింపు:మంత్రి పేర్ని నాని - నూజివీడులో రెడ్ అలర్ట్
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నూజివీడులో మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ తప్పదని మంత్రి పేర్ని నాని తెలిపారు.

red alert extend in nuziveedu town