ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇండ్‌ భారత్ ప్లాంట్‌కు రుణాలపై ఎంపీ విజయసాయి లేఖ.. స్పందించిన ఆర్​బీఐ

ఆర్​బీఐకి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు(mp vijayasai reddy letter to rbi news). ఎంపీ రఘురామకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కు బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆర్బీఐ.. నిబంధనల మేరకు లేకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ind barath thermal power limited bank loans
rbi reply to mp vijayasai reddy letter

By

Published : Oct 23, 2021, 7:24 PM IST

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రిజర్వు బ్యాంకు(rbi reply to mp vijayasai reddy letter news) స్పందించింది. ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్​కు బ్యాంకు రుణాల (ind barath thermal power limited bank loans news) మంజూరులో అవకతవకలపై విచారణ జరపాలంటూ ఆర్​బీఐకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. తాజాగా రిజర్వ్​ బ్యాంక్​ స్పందించి.. మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ ఎంపీ విజయసాయి రెడ్డికి ఆర్బీఐ సీజీఎం జయశ్రీగోపాలన్ సమాధానమిచ్చారు.

విజయసాయి రెడ్డి రాసిన లేఖలోని వివిధ అంశాలు పరిశీలనలో ఉన్నాయని.. నిబంధనలకు అనుగుణంగా లేనట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజర్వ్​ బ్యాంక్​ స్పష్టం చేసింది. ఇండ్ భారత్ థర్మల్ పవర్​కు బ్యాంకు రుణాల అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఈ ఏడాది జూలై 21 తేదీన ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఆర్బీఐ లేఖ

ABOUT THE AUTHOR

...view details