కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్ నేతృత్వంలో రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంకిపాడు మండలంలో 40 రేషన్ షాపులు ఉండగా 20 వేల 158 లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఆయా గ్రామాలకు చెందిన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల, తుర్లపాడు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ఉచిత రేషన్ సరుకుల పంపిణీని పరిశీలించారు. గుంపులుగా ఉన్న రేషన్ దుకాణం వద్ద సామాజిక దూరం పాటించాలని సూచించారు. వాలంటీర్లతో దగ్గరుండి మార్కింగ్ వేయించారు. అందరూ ఒకేసారి వచ్చి ఎండలో నిలబడవద్దని కోరారు. ముందస్తుగా సమాచారం ఇచ్చిన కుటుంబాలు.. సరుకులు తీసుకోవటానికి వచ్చేలా చూడాలని వాలంటీర్లకు సూచించారు.