మద్యం తయారీకి సంస్థలు సరికొత్త దందాకు తెరలేపాయి. మొక్కజొన్నతో పాటు రేషన్ బియ్యాన్ని మొలాసిస్ తయారీకి ఉపయోగిస్తున్నాయి. దళారులను ప్రోత్సహించి తమకు కావాల్సిన ముడి ఉత్పత్తులను, ఏపీ సహా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
కిలో రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి పది రూపాయలకు కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న మిల్లుల్లో మద్యం తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ తతంగంలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులకు సైతం నెలవారీ ముడుపులు అందుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున... రేషన్ బియ్యం అక్రమంగా లారీల్లో తరలుతున్నట్లు తెలుస్తోంది.
మద్యం తయారీకి రేషన్ బియ్యం..! - మద్యం తయారీకి రేషన్ బియ్యం
పేదలకు రాయితీపై అందజేసే రేషన్ బియ్యం.. పక్కదారి పడుతోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రాయితీపై పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యం... మద్యం దళారులకు వరంగా మారుతోంది. రేషన్ బియ్యాన్ని మద్యం తయారీకి వినియోగిస్తూ... సొమ్ము చేసుకుంటున్నారు.
మద్యం తయారీకి రేషన్ బియ్యం !
ఇదీ చదవండి: