ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ డీలర్ అరెస్ట్ - ఐతవరంలో రేషన్ బియ్యం పట్టివేత వార్తలు

కృష్ణా జిల్లా ఐతవరంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న డీలర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. లారీ ఓనర్, డ్రైవర్​పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ration rice seized
బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ డీలర్ అరెస్ట్

By

Published : Nov 25, 2020, 9:04 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న చౌక ధరల దుకాణం డీలర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతవరంలోని రేషన్ షాప్ నుంచి 12 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్​కు తరలించారు. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొజ్జగని కొండలరావు ,ప్రభు, లారీ డ్రైవర్ బొండాల నాగేశ్వరావు, లారీ ఓనర్​పై కేసు నమోదు చేశామని నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. బియ్యాన్ని నందిగామ డిప్యూటీ తహసీల్దార్​కి అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details