కృష్ణా జిల్లా విజయవాడలోని ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలోని రేషన్ దుకాణంపై విజిలెన్స్, పౌరసరఫరా శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనగర్ కాలనీలోని డిపో-214లో నిల్వ ఉంచిన సుమారు 1200 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. విజిలెన్స్ ఎస్పీఏస్పీటీ కనకరాజు బియ్యం డిపోకు చేరుకుని పెద్దఎత్తున ఉన్న ప్రజా పంపిణీ బియ్యం నిల్వలను పరిశిలించారు.