కృష్ణా జిల్లా అడవిరావులపాడు వద్ద రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. నందిగామ మండలం పెద్దవరం నుంచి భీమవరానికి వెళ్తున్న లారీలో 15 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ సీఐ కనకరావు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని.. లారీని పీడీయస్ డీటీకి అప్పగించినట్లు చెప్పారు.
అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - కృష్ణా జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా
కృష్ణా జిల్లా పెద్దవరం నుంచి భీమవరానికి అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
TAGGED:
krishna dist crime news