ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజిల్​​ లేక రోడ్డుపై ఆగిన రేషన్​ పంపిణీ వాహనం - నందిగామలో రేషన్​ వాహన నిర్వాహకులు కష్టాలు

ఇంటింటికీ రేషన్​ పంపిణీ తలకు మించిన భారంగా మారిందని వాహనాల నిర్వాహకులు తెలిపారు. కృష్ణాజిల్లా నందిగామలో డీజిల్​​ లేక.. నిత్యావసర సరకులు పంపిణీ చేసే వాహనం నిలిచిపోయింది. కొంతదూరం తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ration delivery vehicle owners problems in nandigama, nandigama ration delivery vehicles situation
నందిగామలో రేషన్ పంపిణీ వాహనదారుల ఇబ్బందులు, ఆయిల్ లేక నిలిచిన రేషన్ పంపిణీ వాహనం

By

Published : Mar 26, 2021, 11:00 PM IST

ప్రతి ఇంటికీ రేషన్ పంపిణీ చేయలేక కొందరు వాహన నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో ఇంటింటికీ నిత్యావసర సరకులు పంపిణీ చేసే వాహనం డీజిల్​ లేక ఆగిపోయింది. తహసీల్దారు కార్యాలయం రోడ్డులో నిలిచిపోయిన వాహనాన్ని.. ఇతరుల సహాయంతో డ్రైవర్ కొంతదూరం తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

రెండు వేలకు పైగా కార్డుదారులకు ఇంటింటికీ వెళ్లి సరకులు పంపిణీ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని వాహన నిర్వాహకులు చెబుతున్నారు. తమపై కొంత భారం తగ్గించాలని తహశీల్దార్ చంద్రశేఖర్​ను కొందరు కలిసి ఇటీవల విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details