లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల ద్వారా ఒక్కో కుటుంబానికి బియ్యం, కిలో శనగలు పంపిణీ చేస్తున్నారు. ఆ ఇచ్చే కొంచెంలో కూడా కొంతమంది డీలర్లు కిలో శనగలకు 840 గ్రాములు మాత్రమే ఇస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం ఆశ్వారాపాలెంలో చౌకధరల దుకాణం డీలర్‌ను అందుకు సంబంధించి ఆరా తీయగా.... తమకు సరుకులు తగ్గించి ఇవ్వడం వల్లే తాము తగ్గించి ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో రెండు చౌకధరల దుకాణాలకు శనగలు సరిపడా ఇవ్వని కారణంగా.. కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయమై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కిలో ఇవ్వాల్సింది.. 840 గ్రాములే ఇస్తున్నారు! - ration dealer latest news
లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఇస్తున్న బియ్యం, శనగల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇచ్చే కిలో శనగలు కూడా 840 గ్రాములు మాత్రమే పంపిణీ చేస్తుండడంపై.. లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చౌకధరల దుకాణాల వద్ద అవకతవకలు