ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు - కృష్ణా జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు

కృష్ణా జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.

rathasapthami
కృష్ణా జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు

By

Published : Feb 19, 2021, 4:11 PM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులు కొనసాగే ఈ ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామునే స్వామి వారికి సుప్రభాత సేవ, బలిహరణం, భజనలు, స్వామివారి నామ సంకీర్తనలు, అర్చనలతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పదివేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలియజేశారు.

వేకనూరు గ్రామంలో ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా.. వేలాది మంది భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు నిర్వహించారు. స్వామి కల్యాణం అనంతరం రధోత్సవం ఘనంగా జరుగుతుంది. దివిసీమలో ఉన్న ఒకే ఒక్క సూర్య దేవాలయం కావడంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details