కృష్ణా జిల్లా నూజివీడు ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రయాణికులు, రైతులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీతారాంపురం గ్రామం సమీపంలో గల పట్టిసీమ కాలువ వద్ద ప్రధాన రహదారి ఛిద్రమై అధ్వానంగా మారింది. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. సుమారు 3 గంటలసేపు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
రహదారి మరమ్మతులు చేయాలని స్థానికుల ఆందోళన - నూజివీడులో రాస్తారోకో
కృష్ణా జిల్లా నూజివీడు ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రయాణికులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. వీరి నిరసనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
రహదారికి మరమ్మతులు చేయాలంటూ రాస్తారోకో