మైనర్‌పై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడిన నిందితుణ్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లి ప్రోద్బలంతోనే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భర్త చనిపోగా... రాంబాబు అనే వ్యక్తితో బాలిక తల్లి వివాహేతర సంబంధంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ చిన్నారిని బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన బాలిక తల్లి, నిందితుడు రాంబాబు, వారికి సహకరించిన మరో మహిళను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారిపై ఏడాదిగా మృగాడి అత్యాచారం.. బాలిక తల్లి ప్రోద్బలంతోనే..! - rape case in krishna district
కృష్ణా జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ కన్న తల్లే తన కూతురి పాలిట శాపంగా మారింది. ఆమె ప్రోద్బలంతో ఓ మృగాడు చిన్నారిపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణాజిల్లాలో తల్లి ప్రోద్బలంతోనే బాలికపై అత్యాచారం