రంగురంగుల ముగ్గులతో దర్శనమిచ్చిన సచివాలయం - rangoli competition news in secretariat
సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులు సచివాలయాన్ని ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు. రంగవల్లులు, కోలాటం, బసవన్నలు, హరిదాసులతో సచివాలయ ప్రాంగణం సందడిగా మారింది. పార్కింగ్ ప్రాంతంలో రంగవల్లుల పోటీలను సచివాలయ ఉద్యోగ సంఘం నిర్వహించింది. రంగురంగు ముగ్గులతో సచివాలయం కళాత్మకంగా దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. సంక్రాంతి పండగను ముందుగానే జరుపుకోవటం సంతోషాన్నిచ్చిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.