అట్లూరి రామ్మోహన్‌రావు కన్నుమూత - రామోజీరావు బాల్య మిత్రుడు అట్లూరి రామ్మోహన్ మృతి
14:37 October 22
రామోజీ, ఈనాడు గ్రూపు సంస్థల్లో సుధీర్ఘకాలం పని చేసిన అట్లూరి రామ్మోహన్‌రావు
రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్‌రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామ్మోహన్‌రావు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1974లో ఈనాడులో ప్రస్థానాన్ని ప్రారంభించారు.
1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది... 1995 వరకు కొనసాగారు. 1992 నుంచి ఫిల్మ్‌సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. రామోజీ, ఈనాడు గ్రూపు సంస్థల్లో ఆయన సుధీర్ఘకాలం పని చేశారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు సహాధ్యాయి, బాల్య స్నేహితుడు.
ఇవీ చదవండి: