ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ఆర్టీఐ ప్రధాన కమిషనర్​గా రమేశ్​కుమార్ నియామకం - ఏపీ ప్రభుత్వం తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్​, కమిషనర్​ను నియమించింది. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ నీలం సాహ్నీ జారీ చేశారు.

ramesh kumar appointed as ap right to information chief commissioner
ramesh kumar appointed as ap right to information chief commissioner

By

Published : Jul 2, 2020, 6:37 PM IST

Updated : Jul 3, 2020, 3:11 AM IST

రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రధాన కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.రమేశ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్​గా రేపాల శ్రీనివాసరావును నియమించారు.

వీరివురిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించినట్లు సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు ఏళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు సర్వీసు నిబంధనల మేరకు వీరు పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.


ఇదీ చదవండి:రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని

Last Updated : Jul 3, 2020, 3:11 AM IST

ABOUT THE AUTHOR

...view details