ప్రేమ విఫలమైందనో.. తల్లిదండ్రులు తిట్టారనే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక వైద్యులంతా విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉండటం కలవరపెడుతోందని డా. అయోధ్య అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడే వారి లక్షణాలను ముందే గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి బాధితుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అలాగే కుటుంబ సభ్యుల భరోసాతో 50 శాతం వైద్యం అందించవచ్చన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు.
కౌన్సిలింగ్‌తో బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు - ఆత్మహత్య నివారణ కోసం అవగాహనా ర్యాలీ
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో మానసిక వైద్యులంతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలను ముందే గుర్తించవచ్చని డాక్టర్ అయోధ్య అంటున్నారు.
ఆత్మహత్య నివారణ కోసం అవగాహనా ర్యాలీ