ఎయిడ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదనీ.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలతో జీవన ప్రమాణం మెరుగుపరచుకోవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ఎయిడ్స్ మృతులకు నివాళిగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హెచ్.ఐ.వీ సోకితే ఆందోళన చెందకుండా ఏఆర్టీ కేంద్రాల్లో వైద్య సాయం పొందాలన్నారు. దాన్నీ సాధారణ వ్యాధిగానే చూడాలనీ.. ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపొద్దని హితవు పలికారు.
ఎయిడ్స్‌ను చూసి భయపడొద్దు: కలెక్టర్ ఇంతియాజ్ - విజయవాడ
ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరముందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ముందులా దీని గురించి భయపడక్కర్లేదనీ.. ఇప్పుడున్న వైద్య సదుపాయాలతో ఎదుర్కోవచ్చని తెలిపారు.
ఎయిడ్స్‌ను చూసి భయపడొద్దు: కలెక్టర్ ఇంతియాజ్