ఆ గ్రామంలో.. స్వామివారే తోబుట్టువు! - raksha bandan
వినూత్నంగా రాఖీ పండుగ నిర్వహించారు కృష్ణా జిల్లా పెదపులిపాకలోని మహిళలు. పద్మనాభస్వామివారి విగ్రహానికి రాఖీలు కట్టారు. స్వామినే తమ తోబుట్టువుగా భావిస్తామని చెప్పారు.

raksha-bandan
వినూత్నంగా రాఖీ పండుగ
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో.. రాఖీ పండుగను మహిళలు వినూత్నంగా నిర్వహించారు. విజయరాజరాజేశ్వరి దేవాలయంలో కొలువైన పద్మనాభస్వామి వారి విగ్రహానికి... రాఖీలు కట్టి ప్రత్యేకత చాటుకున్నారు. లలితా సహస్రనామాలలో పద్మనాభ స్వామిని... అమ్మవారికి అన్నగా పేర్కొనడం వల్ల మహిళలు రాఖీలు కడతారని పండితులు చెబుతున్నారు. అన్నదమ్ములు దూరంగా ఉన్నా....స్వామివారినే తోబుట్టువుగా భావించి రాఖీ పండగ నిర్వహించటం ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు.