ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్​ భవన్​లో ఘనంగా దీపావళి వేడుకలు - పర్యావరణ హితమే... దీపావళి

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు....ఊరు,వాడ దీపాలతో పాటుగా పటాసుల శబ్ధంతో మారుమ్రోగాల్సిందే... కానీ బాణాసంచా పేల్చటంతో పర్యావరణం దెబ్బతింటుంది... అందుకు భిన్నంగా ఆలోచించారు మన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్. రాజ్ భవన్​లో దేదీప్యమైన వెలుగుల మధ్య చిన్నారులతో సరాదాగా గడిపారు.

పర్యావరణ హితమే... దీపావళి

By

Published : Oct 28, 2019, 5:30 AM IST

రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అనాథ విద్యార్థులతో కలిసి పండుగ జరుపుకున్నారు. దీపావళి అంటే చెడుపై మంచి విజయమని ...ప్రతి ఒక్కరూ పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

రాజ్​భవన్​లో ఘనంగా దీపావళి

కాలుష్య నివారణయే...ధ్యేయం.
దీపావళి అంటే టపాసులు పేల్చడం కాదని ..పర్యావరణ హితాన్ని కోరుతూ పండుగను జరుపుకోవడమని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నిరూపించారు . రాజ్‌భవన్‌లో పర్యావరణాన్ని కాలుష్యం చేసే టపాసులను గవర్నర్‌ నిషేదించారు. దీపావళి వేడుకల్లో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు. అనాథాశ్రమ విద్యార్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు . వారితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక, సాంప్రదాయాల మేళవింపుగా పండుగలను జరుపుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ పిలుపునిచ్చారు. దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయమని తెలిపారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన డప్పు వాద్యాలు , లంబాడ నృత్యాలను ఆకట్టుకున్నాయి. కైకలూరు ఆశ్రమ విద్యార్ధుల యోగాసనాలతో ఆకట్టుకున్నారు. మిమిక్రీ, ఇంద్రజాలం అబ్బురపరిచాయి.

దీపావళి శుభసందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుకుంటున్నా. చెడుపై మంచి గెలుపుకు దీపావళి ప్రతీకగా నిలుస్తోంది. శాంతికి, మతసామరస్యానికి, నవసమాజ నిర్మాణానికి ఇలాంటి పండుగలు తోడ్పడతాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను .

బిశ్వ భూషణ్ హరిచందన్ , గవర్నర్

ABOUT THE AUTHOR

...view details