లాక్డౌన్ కారణంగా విజయవాడలో చిక్కుకున్న వలస కూలీలకు... రాజస్థాన్‌కు చెందిన రాజపురోహితులు నిరంతరం ఆహారం పంపిణీ చేస్తున్నారు. రాజపురోహిత్ ఫ్రెండ్స్ సర్కిల్ పేరిట ఒక బృందంగా ఏర్పడి పేదలు, వలస కార్మికులకు అల్పహారం, భోజనం అందిస్తున్నారు.
వలస కూలీలకు అండగా రాజస్థాన్ వ్యాపారులు - విజయవాడలో లాక్డౌన్ ప్రభావం
లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇందుకు భిన్నంగా విజయవాడలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు తమ స్వగ్రామాలకు వెళ్లకుండా... లాక్డౌన్ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Rajasthan merchants help migrant workers in vijayawada