లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు కూరగాయలను కొనుగోలు చేసేందుకు వీలుగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మార్కెట్లను ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం అవనిగడ్డ జూనియర్ కళాశాలలో రైతు బజారు ప్రారంభించారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఇప్పుడు నాగాయలంక మండలంలో రైతు బజారును అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు ప్రారంభించారు.. దళారీలు లేకుండా సరసమైన ధరలకు కూరగాయలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక ఎమ్మార్వో, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నాగాయలంకలో రైతు బజారు ప్రారంభం - coronavirus news
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు కూరగాయలను కొనుగోలు చేసేందుకు వీలుగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మార్కెట్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు మరింత వీలుగా ఉండేలా కృష్ణాజిల్లా నాగాయలంక గ్రామంలోని దివి మార్కెట్ యాడ్లో రైతు బజారును ప్రారంభించారు.
నాగాయలంకలో రైతు బజారు ప్రారంభం