పశ్చిమ కృష్ణాలో వర్ష బీభత్సం
పశ్చిమ కృష్ణాలో నిన్న సాయంత్రం పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగిపడడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నందిగామ పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.