ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో మరట్వాడ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. దీనికి అనుబంధంగా ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఛత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో వర్షాలు ఇలా..
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రేపు దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ఇక రాయలసీమలోనూ అక్కడక్కడా పిడుగులతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతల వల్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.