ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వర్షం.. రోడ్లు జలమయం

విజయవాడలో ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

rain in vijayawada
విజయవాడలో వర్షం.. రోడ్లు జలమయం

By

Published : Jul 13, 2020, 11:35 PM IST

విజయవాడ నగరంలో సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని బందరు రోడ్డుపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం పడిన ప్రతీసారి సమస్యలు తలెత్తుతున్నాయని నగరవాసులు చెబుతున్నారు.

రోడ్డు సగానికి పైగా నీళ్లు నిలిచేసరికి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. వానాకాలం దృష్ట్యా.. నీళ్లు నిలిచిన ప్రాంతాలను మున్సిపల్ అధికారులు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details