ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరుణించిన వరుణుడు... అమరావతిలో వర్షం - amaravathi

ఠారెత్తిస్తున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఆంధ్రా రాజధాని అమరావతి, కాపిటల్ సిటీ విజయవాడలో వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చల్లబడింది.

కరుణించిన వరుణుడు... అవరావతిలో వర్షం

By

Published : Jun 12, 2019, 8:05 PM IST

Updated : Jun 12, 2019, 9:24 PM IST

విజయవాడలో ఉదయం నుంచి ఎండ ఠారెత్తించింది. బయటికి రావాలంటేనే బయపడాల్సిన పరిస్థితి కనిపించింది. ఈ తరుణంలో సాయంత్ర సమయాన ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎండతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇదో వరంలా కనిపించింది. వేడిగాలులతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. చిరుజల్లుల రాకతో ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. అదేవిధంగా అమరావతిలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వానకు పలుచోట్ల హోర్డింగులు విరిగి పడ్డాయి.

కరుణించిన వరుణుడు... అవరావతిలో వర్షం
Last Updated : Jun 12, 2019, 9:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details