ఉపరితల ద్రోణి కారణంగా రాష్టంలో నేటి నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురువనున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఝార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు 1.5 కిమీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణిగా ఏర్పడింది.
నేటినుంచి ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు..ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో రేపటినుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరోవైపు... నైరుతి రుతుపవనాల కదలిక మందకొడిగా ఉందని అధికారులు తెలిపారు.