ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రికార్డు స్థాయిలో పూర్తైన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు

ఉప్పలూరు - గుడివాడ - మోటూరు, గుడివాడ - మచిలీపట్నం మధ్య ఏకబిగిన 69కి.మీల రైల్వే లైన్ డబ్లింగ్ పనులను రికార్డు స్థాయిలో పూర్తిచేసి... గురువారం ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రికార్డు స్థాయిలో పూర్తైన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
రికార్డు స్థాయిలో పూర్తైన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు

By

Published : Oct 23, 2020, 10:01 AM IST

ఉప్పలూరు - గుడివాడ - మోటూరు, గుడివాడ - మచిలీపట్నం మధ్య ఏకబిగిన 69కి.మీల రైల్వే లైన్ డబ్లింగ్ పనులను రికార్డు స్థాయిలో పూర్తిచేసి గురువారం ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే వికాస్ నిగమ్ లిమిలెడ్ (ఆర్.వీ.ఎన్.ఎల్) ద్వారా నిర్వహించిన ఈ ప్రాజెక్ట్ పనులు ఇంజనీరింగ్, డిజైనింగ్​లో ఆధునిక నిర్మాణ పద్దతులు, సాంకేతికతలకు ప్రామాణికంగా నిలుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. 69కి.మీ.ల నిడివి గల ఈ కొత్త డబుల్ లైన్ మొత్తం 25టన్నుల యాక్సిల్ భారాన్ని గంటకు 110 కి.మీల వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించినట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. 60కిలోల ఫ్రీస్టెస్డ్ కాంక్రీట్, సిమెంట్ స్లీపర్లను నిర్మాణంలో వినియోగించామని ద.మ.రైల్వే తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details