ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉన్నతాధికారుల వేధింపులతో రైల్వే కీ మెన్ ఆత్మహత్య

ఉన్నతాధికారుల వేధింపులతో మనస్థాపానికి గురైన రైల్వే కీ మెన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. శీతల పానియంలో గడ్డి మందు కలుపుకుని తాగేశాడు. అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

railway-key-men-commit-suicide-with-harassment-by-bosses
railway-key-men-commit-suicide-with-harassment-by-bosses

By

Published : Jun 4, 2020, 11:19 AM IST

Updated : Jun 4, 2020, 11:36 AM IST

రైల్వే కీ మెన్ సెల్ఫీ సూసైడ్

ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రైల్వేశాఖలో ఓ చిరుద్యోగి పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో అతడి ఆవేదనకు అద్దం పడుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడుకు చెందిన పెయ్యాల రాజు రైల్వే శాఖలో కీ మెన్‌గా పని చేస్తున్నాడు. గతంలో చెరువు మాధవరం రైల్వే స్టేషన్ ఏరియా పరిధిలో పని చేసిన అతడికి ప్రమోషన్‌కు అవకాశం ఉన్నా పలు కారణాలతో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పైగా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ఏరియాకు బదిలీ చేయగా మరింత మనస్థాపానికి గురయ్యాడు.

బంధువుల ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్న అతడు పలు అవస్థలకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మనో వేదనకు గురై బుధవారం రైల్వే ట్రాక్‌ వద్ద విధుల్లో ఉండగానే గడ్డిమందును శీతల పానీయంలో కలిపి సేవించాడు. సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Last Updated : Jun 4, 2020, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details