కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామ సమీపంలో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వైపు నుంచి వస్తున్న రెండు కార్లలో 1420 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విస్సన్నపేటలో ఎస్ఈబీ అధికారుల వరుస దాడులు - raids by SEB officers in Visannapet
అధికారులు ఎన్ని దాడులు చేసినా తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా అదుపులోకి రావటం లేదు. తాజాగా కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామ సమీపంలో 1420 బాటిళ్లను పట్టుకున్నారు. మరొకచోట సారా తయారీకి తీసుకు వెళుతున్న 1000 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
విస్సన్నపేటలో ఎస్ఈబీ అధికారుల వరుస దాడులు
ఇదే ప్రాంతంలో రెండు ఆటోలలో సారా తయారీకి తీసుకువెళుతున్న 1000 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మద్యం అక్రమ రవాణా దందాపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపుతామని ఎస్ఈబీ అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండిభాషా సంఘం సభ్యులుగా నలుగురి నియామకం