- విశాఖలో...
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను విశాఖ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పాయకరావుపేట లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూర్తి ఏసు ఆధ్వర్యంలో రోగులకు రొట్టెలు, పాలు, పండ్లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ న్యాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం భారత్ - చైనా వివాదంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు.
అనకాపల్లి మండలం వెంకుపాలెం వృద్ధాశ్రమంలో పేదలకు పాలు రొట్టెలను పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గంగాధర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తుట్టా రమణ, దాసరి సంతోష్, గున్న బాబు పాల్గొన్నారు.
చీడికాడ మండలం అప్పలరాజుపురం అనాథ వృద్దాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్దాశ్రమానికి నిత్యావసర వస్తువులు, పండ్లు, రొట్టెలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొండబాబు, నేతలు జోగారావు, చిన్నంనాయుడు, పరదేశి, అప్పన్నదొర పాల్గొన్నారు.
- కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా విజయవాడలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి నిత్యావసరాలు అందజేశారు. గాల్వాన్ ఘటనతో రాహుల్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. గాల్వాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించారు.